Sri Lakshmi Venkatesawara Swamy Devastanam

Sri Lakshmi Venkatesawara Swamy Devastanam Transport facility is APSRTC bus no :31ST, 7A from KR market to temple via MG road

26/08/2026

ఈరోజు స్వామి వారి శాంతి కళ్యాణం

26/08/2026

ఆనూపురార్పిత నుజాత సుగంధ పుష్ప /
సౌరభ్య సౌరభకరౌ సమసన్ని వేశౌ //
సౌమ్యౌ సదానుభవనేఽ పి నవానుభావ్యౌ /
శ్రీ వేంకటేశ చరణం శరణం ప్రపద్యే ///

తాత్పర్యం ::: ఓ స్వామీ ! కాలి యందెవరకు సమర్పించబడిన మేలైన సువాసన గల పూవుల సుగంధమునకు మరింత పరిమళము నొ సగునియు
సమముగా నమరినవియు చూచుట కెంత యంద మైనవియు, ఎల్లప్పుడు ననుభవించుచున్నను క్రొత్తగా
ననుభవింప మనసుగొల్పు ననియు నగు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదములనే శరణు జొచుచున్నాను.........

శ్రీమన్  కృపాచల నిధే   కృత సర్వలోక  / సర్వజ్ఞ  శక్తః నతవత్సలః  సర్వ శేషిన్  // స్వామి న్  సుశీల సులభా శ్రీ తపారిజాత  / శ...
25/08/2026

శ్రీమన్ కృపాచల నిధే కృత సర్వలోక /
సర్వజ్ఞ శక్తః నతవత్సలః సర్వ శేషిన్ //
స్వామి న్ సుశీల సులభా శ్రీ తపారిజాత /
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే //

తాత్పర్యం :: ఓ వెంకటేశ్వర స్వామీ ! నీవు శ్రీమంతుడవు , దయాసముద్రుడవు ఎల్ల లోకములకు కర్తవు . సర్వము తెలిసినవాడవు సమర్థుడవు . నమస్కరించు వారి యెడల వాత్సల్యము చూపు వాడవు . ఈ చేతనా చేతన రూపమగు ప్రపంచమున నీవే ప్రధానుడవు. మంచి స్వభావము కలవారికి సులభుడవు ఆశ్రితులకు పారిజాతము వంటి వాడవు
ఓ దేవా ! నీ పాదములే శరణమని ఆశ్రియించుచున్నాను......

25/08/2026

శ్రీ వెంకటేశ్వర ప్రపత్తిః

ఈశానాం జగతోఽస్య వెంకటపతే ర్విష్ణోః పరాం ప్రేయసీం /

తద్వ క్షఃస్థలనిత్యవాసరసికాం తత్ క్షాంతి సంవర్ధినీమ్ /
పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రియం
వాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరమ్ //

తాత్పర్యం :: ఈ లోకమునంతటికిని యజమానురాలును సాక్షా త్ విష్ణుమూర్తి అయిన విష్ణుమూర్తి వెంకటాచలపతికి మిక్కిలి ప్రియురాలను
అతని క్షమాగుణము పెంపొందింప జేయునదియు
తామర పువ్వుల అలంకారముగా తనచి గురుకేల
దాల్చున దియు పద్మాసనమున కూర్చుండి
యుండు నదియు వాత్సల్యము మొదలగు
మేలి గుణములచే ప్రకాశించు నదియూ ఎల్ల లోకములకు తల్లియు భగవతి యనగు లక్ష్మీదేవికి నమస్కరించుచున్నాను....

*🔔ఓం నమో వేంకటేశాయ* భక్తులకు విజ్ఞప్తి1) రేపు *21  ఆగష్టు శుక్రవారము*ఉదయము  5.00 గం.లకు *పంచామృత అభిషేకము* *శ్రావణ శుక్ర...
20/08/2026

*🔔ఓం నమో వేంకటేశాయ*

భక్తులకు విజ్ఞప్తి

1) రేపు *21 ఆగష్టు శుక్రవారము*
ఉదయము 5.00 గం.లకు *పంచామృత అభిషేకము*

*శ్రావణ శుక్రవారం శ్రీ స్వామివారి దివ్య పంచామృత అభిషేకం*

2) ఉదయం 9.00 గం.లకు *అమ్మవారి వరలక్ష్మి వ్రతం*

ఇట్లు
దేవాలయ అభివృద్ధి కార్యవర్గము
శ్రీనివాస క్షేత్రం తాడిగడప 🙏🏽🙏🏽🙏🏽

17/08/2026

అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తర నక్షత్రం - పండ్ల అలంకారం

16/08/2026

సుముఖం సుహృదం సులభం సుఖదం /
స్వనుజం చ సుకాయమమోఘశరమ్ //
అపహాయ రఘూ ద్వహ మన్య మహం /
నత కథంచన కంచన జాతు భజే //

తాత్పర్యం :: ఓ శ్రీరామా ! నీ ముఖము, శరీరము దివ్య సుందరములు, నీ మనసు మిక్కిలి మృదుల మైనది ఎల్ల జనములకు సులభముగా ఆశ్రయింప దగ్గినవాడవై సుఖము నొసగుదువు మంచి తోబుట్టువులు గలవాడవు మెక్కు వోని యమ్ములు గలవాడవు ఓ రఘుపతీ ! నిన్ను విడచి వేరొకని
నెవ్వని నెప్పుడును సేవింపను......

14/08/2026

శ్రావణమాసం మొదటి శుక్రవారం అమ్మవారికి గాజుల అలంకరణ మరియు సహస్రనామ కుంకుమార్చన

Address

L V Gardens, STBL COLONY, NEAR KWALITY ICE CREAM FACTORY, TADIGADAPA
Vijayawada
521137

Opening Hours

Monday 6am - 11am
6pm - 8pm
Tuesday 6am - 11am
6pm - 8pm
Wednesday 6am - 11am
6pm - 8pm
Thursday 6am - 11am
6pm - 8pm
Friday 4am - 10am
6pm - 8pm
Saturday 6am - 11am
6pm - 8pm
Sunday 6am - 11am
6pm - 8pm

Telephone

+916302733990

Alerts

Be the first to know and let us send you an email when Sri Lakshmi Venkatesawara Swamy Devastanam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sri Lakshmi Venkatesawara Swamy Devastanam:

Shortcuts

Share