Vijayawada Official

Vijayawada Official Vijayawada Official page is an unique PAGE for Vijayawada. The main motto of this page is to share information and to bring awareness about our VIJAYAWADA

Vijayawada earlier known as Bezawada, is the third largest city in Andhra Pradesh, located on the banks of river Krishna and bounded by the Indrakiladri Hills on the West and the Budameru River on the North. Vijayawada literally translates to "The Place of Victory". Vijayawada is the major commercial Hub of Andhra Pradesh and the third largest after Hyderabad and Visakhapatnam. Vijayawada is also

known as the “The Business Capital of Andhra Pradesh” and “The City on Fast track”. Situated along the Madras-Howrah and Madras-Delhi Railway route, this is the largest railway junction of the South Central Railway region. History

Formerly Vijayawada was known as Bezwada, in the 5th and 6th Centuries it was an important centre of Vishnukundin rulers. It was taken by Badami Chalukyas became the headquarters of Eastern Chalukya. There was a Buddhist monastery, in 639 Chinese pilgrim Hiuen Tsang stayed here. There are five rock-cut cave-temples built in the 7th century during the rule of Eastern Chalukya. Etymology

There are many tales behind the origin of the name Vijayawada. At first it was named as Chandrala which comes under the family of Gajapathis which means victory and later Legends have it that this was the place where Arjuna was blessed by Shiva, on Indrakiladri Hill. In another legend it is stated that Goddesses Durga killed the demon and relaxed in this place for some time. As she was victorious (Vijaya), the place got the name as Vijayawada (Vijaya: victory and Wada: city/place/location) which literally means "City of Victory". The Epic of Mahabharata refers to Indrakiladri hills as the place where Arjuna secured “Pasupathastra” from Lord Siva. In some legends, Vijayawada was referred to as Vijayavata and Rajendracholapura. A tale behind its acquiring the name "Bezawada" is that Goddesses Krishnaveni (River Krishna) requested Arjuna to make a passage for her to merge into the Bay of Bengal. Hence Arjuna made a bejjam (hole) through the mountains and the place came to be known as Bejjamwada which later changed to Bezawada.

29/02/2016

ఎక్కడ పెట్టుకోమంటారు ఇంత బడ్జెట్???
ఆంధ్రప్రదేశ్ కి ఇంత గొప్పగా బడ్జెట్ కేటాయిస్తారని కలలో కూడా అనుకోలేదు.
పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపులు ఇవే.
పోలవరం ప్రాజెక్ట్‌కు రూ. 100 కోట్లు కేటాయింపు
విజయవాడ మెట్రోకు రూ. 106 కోట్లు కేటాయింపు
ఏపీ ఐఐటీకి-40 కోట్లు, హైదరాబాద్ ఐఐటీకి రూ.20 కోట్లు..
రెండు రాష్ట్రాల్లో ట్రైబల్ వర్సిటీలకు రూ.కోటి చొప్పున మంజూరు
ఏపీ ఐఐఎం-రూ.30 కోట్లు, నిట్‌కు రూ.40 కోట్లు
ఐఐఎస్‌ఈఆర్-రూ.40 కోట్లు
ఏపీలో ట్రిపుల్ ఐటీలకు రూ.20 కోట్లు కేటాయింపు
నాబార్డుకు రూ.6300 కోట్లు
విశాఖ పోర్టుట్రస్టుకు రూ.231 కోట్లు
డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌కు -రూ. 15 కోట్లు
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.1678 కోట్లు
హైదరాబాద్‌లోని ఇన్‌కాయిస్‌కు రూ.115 కోట్లు
వెనకబడిన ప్రాంతాలకు గ్రాంట్లు నిలిపివేత
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించని కేంద్రం

నవరాత్రి ఉత్సవాలకి అందంగా ముస్తాభు అయిన విజయవాడ
13/10/2015

నవరాత్రి ఉత్సవాలకి అందంగా ముస్తాభు అయిన విజయవాడ

రాష్ట్ర విభజన అనంతరం  #నవ్యాంధ్రప్రదేశ్‌ ప్రజల కోసం  #బసవతారకం కేన్సర్‌ అస్పత్రి ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సుమా...
28/09/2015

రాష్ట్ర విభజన అనంతరం #నవ్యాంధ్రప్రదేశ్‌ ప్రజల కోసం #బసవతారకం కేన్సర్‌ అస్పత్రి ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సుమారు 500 కోట్లతో బసవ తారకం కేన్సర్‌ ఆసుపత్రి, పరిశోధన కేంద్రాన్ని స్థాపించబోతున్నారు. దీనిని నూతన రాజధాని అమరావతి సమీపంలోని నల్లపాడులో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బసవ తారకం ఆసుపత్రికి సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. నవ్యాంధ్రలో ఏర్పాటు చేసే ఈ ఆసుపత్రి నిర్వహణను గుంటూరు కేంద్రంగా పని చేస్తున్న అంతర్జాతీయ కాకతీయ కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్వాహకులకు అప్పగిస్తారని తెలుస్తోంది. దీని నిర్మాణానికి భారీగా విరాళాలు ఇచ్చేందుకు ప్రవాసాంధ్రులు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. నల్లపాడు రైల్వే స్టేషన్‌కు కిలోమీటరు దూరంలో భారతీయ విద్యాభవన్‌కు గతంలో కేటాయించిన 50 ఎకరాల స్థలాన్ని కేన్సర్‌ ఆస్పత్రి నిర్మాణానికి ఎంపిక చేశారు. కార్పొరేట్‌ విద్యా సంస్థలు బలపడటంతో భారతీయ విద్యా భవన్‌ అభివృద్థి కుంటుపడింది. దీంతో 25 ఏళ్లుగా ఈ స్థలాన్ని రెవెన్యూ అధికారులు కాపాడలేక సతమతమవుతున్నారు. ఈ స్థలంలో కేన్సర్‌ ఆసుపత్రి, పరిశోధన కేంద్రాన్ని నిర్మిస్తే నవ్యాంధ్ర ప్రజలకు అనువుగా ఉంటుందని, దీనిని ప్రతిపాదిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలోని 13 జిల్లాలకు నల్లపాడు స్టేషన్‌కు రైల్వే కనెక్షన్‌ ఉంది. దీంతో పాటు గుంటూరు ప్రభుత్వ వైద్యశాల, గుంటూరు మెడికల్‌ కాలేజీ కూడా ఈ స్థలానికి 5 కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఈ స్థలంలో కేన్సర్‌ ఆస్పత్రి ఏర్పాటు చేస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

28/09/2015

Bezawada
"రెండు కులాల మద్య కక్షలు కార్పణ్యాలు, ఆ కులాలకు ప్రతినిధులని చెప్పుకొనే వ్యక్తుల మధ్య రగిలే పగలు,సెగలు ఇవాళ బెజవాడ అంటే. బహుశా దాన్ని విజయవాడ అనాలేమో. బెజవాడ కాదేమో.
“నాకు తెలిసిన బెజవాడ, సినిమాలో చూపించిన బెజవాడ మాత్రం కాదు.
“నా బెజవాడ హుందాతో కూడిన రాజకీయాలకు నెలవు. సంగీత సాహిత్యాలకి కాణాచి. చైతన్యానికి, దాతృత్వానికి, సేవాభావాలకు మారు పేరు.
“అయ్యదేవర కాళేశ్వరరావు, అచ్చమాంబ, కే.ఎల్.రావు, టి.వి.ఎస్. చలపతి రావు,
డాక్టర్ దక్షిణా మూర్తి, మరుపిళ్ళచిట్టి, కాకాని వెంకట రత్నం, కాకరపర్తి భావన్నారాయణ, ఖుద్దూస్, ఇటు సేవారంగంలో అటు రాజకీయ రంగంలో ఆణి ముత్యాలు.. బెజవాడ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పేర్లు.
“సంగీతంలో పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, చిలకలపూడి వెంకటేశ్వర శర్మ, మద్దులపల్లి లక్ష్మీనరసింహ శాస్త్రి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బాలాంత్రపు రజనీ కాంత రావు, వోలేటి వెంకటేశ్వర్లు, మహాదేవ రాధాకృష్ణం రాజు, కంభంపాటి అక్కాజీ రావు, శ్రీరంగం గోపాల రత్నం బెజవాడకు కీర్తి ప్రతిష్టలు తెచ్చారు
“సాహిత్యంలో కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, పేరాల భారత శర్మ, చెరుకుపల్లి జమదగ్ని శర్మ వంటి కవి పండిత శ్రేష్ఠులు, పరిశ్రమలతో పాటు ధార్మిక సంస్థలు నెలకొల్పిన చుండూరు వెంకటరెడ్డి, కౌతా పూర్ణానందం, మాగంటి సూర్యనారాయణ, జీ.ఎస్. రాజు, సినీ రంగం ప్రముఖులు పోతిన శ్రీనివాసరావు, పూర్ణ మంగరాజు
కామరాజు, విజయ పిక్చర్స్ చెరుకూరి పూర్ణచంద్రరావు, నవయుగ శ్రీనివాసరావు,
కాట్రగడ్డ నరసయ్య, తెలుగు సినిమా హాస్యానికి కొత్త భాష్యం చెప్పిన జంధ్యాల - బెజవాడ అనగానే చటుక్కున గుర్తుకు రావాల్సిన వాళ్లు వీళ్ళు.
“ఉన్నదంతా దానధర్మాలు చేసిన తుమ్మలపల్లి వారు, తంగిరాల వీరరాఘవయ్య , చోడవరపు దేవల్రాజు, జనాలకు చదువు నేర్పడం కోసం ఊరూరా లైబ్రరీలు పెట్టిన అయ్యంకి వెంకటరమణయ్య, పాతూరి నాగభూషణం, మూఢనమ్మకాలను ఎదిరించిన గోరా, నాటకాల్లో ఎప్పటికీ మరుపురాని అద్దంకి
శ్రీరామమూర్తి, విన్నకోట రామన్న పంతులు, రామచంద్ర కాశ్యప, బి.వి. రంగారావు, సూరవరపు వెంకటేశ్వర్లు, సూరిబాబు- రాజేశ్వరి,
కర్నాటి లక్ష్మినరసయ్య, సీడీ కృష్ణమూర్తి, నాటకాలు ఆడించిన జైహింద్ సుబ్బయ్య, వస్తాదులకే వస్తాదు దండమూడి రామ్మోహన్ రావు, ప్లీడర్లు కొండపల్లి రామచంద్ర రావు, చింతలపాటి
శివరామకృష్ణ, ముసునూరి వెంకటరామ శాస్త్రి, చక్రవర్తి, పాటిబండ సుందరరావు, ఇటీవలే తన 94 ఏట కన్నుమూసిన తుర్లపాటి హనుమంత రావు, పత్రికా సంపాదకులు నార్ల వెంకటేశ్వర రావు, నీలంరాజు వెంకట శేషయ్య, పండితారాధ్యుల
నాగేశ్వర రావు, కే.ఎల్.ఎన్. ప్రసాద్, నండూరి రామమోహన రావు, పురాణం సుబ్రమణ్య శర్మ, కాట్రగడ్డ రాజగోపాలరావు, బొమ్మారెడ్డి, ఏబీకె ప్రసాద్, పీ.ఎస్. ప్రకాశరావు, అయిదుగురు ముఖ్యమంత్రులకు పీ.ఆర్.వో. గా పనిచేసిన భండారు పర్వతాలరావు - వీరిదీ బెజవాడ. బెజవాడ అంటే ఇలాటి వాళ్ళే!
“ప్రభాకర ఉమామహేశ్వర పండితుల ధార్మికోపన్యాసాలు, వేలాదిమందికి వారు నేర్పిన సూర్య నమస్కారాలు, లబ్ధ ప్రతిష్టులయిన రచయితలు తెన్నేటి లత, కొమ్మూరి వేణుగోపాలరావు, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, గొల్లపూడి మారుతీ రావు, నవోదయ బుక్ హౌసులో సాహిత్య సమావేశాలు, దక్షిణ భారత దేశంలో సినిమాలకన్నింటికీ వాల్ పోస్టర్లు సప్లయి చేసే నేషనల్ లితో ప్రింటర్స్ బెజవాడకు లాండ్ మార్కులు.
“టూ టౌన్ లో శిష్ట్లా లక్ష్మీపతి శాస్త్రి లక్ష్మీ జనరల్ స్టోర్స్, వన్ టౌన్ లో మాజేటి రామమోహనరావు బట్టల కొట్టు శ్రీ రామనవమి పందిళ్ళు, రామకోటి సప్తాహాలు, నవరాత్రుళ్ళు ఇలాటివి గుర్తుకు వస్తే అదీ బెజవాడ.
“ తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ హాస్టల్, తంగిరాల వీరరాఘవయ్య కళ్యాణ మండపం, డీ.ఎల్. నారాయణ ఇండియన్ మెడిసిన్ హౌస్, కోగంటి గోపాల కృష్ణయ్య ప్రజా నాట్యమండలి, సామారంగం చౌక్, చల్లపల్లి బంగ్లా, బోడెమ్మ హోటల్, న్యూ ఇండియా హోటల్ సెంటర్, ఆ సెంటర్ లో జరిగే పబ్లిక్ మీటింగులు, అన్నపూర్ణమ్మ హాస్టల్, సత్యనారాయణపురం శివాజీ కేఫ్, అలంకార్ సెంటర్, మొగల్రాజపురం గాంధీ బొమ్మ సెంటర్, బీసెంట్ రోడ్డు, ఏలూరు రోడ్డు, వీధి రాజయ్య మేడ, బందర్ రోడ్డు, పాత శివాలయం, కొత్త గుళ్ళు, జెండా పంజా బస్ స్టాఫ్, అక్కడ గుమిగూడే జనం ఇవీ బెజవాడ అంటే.
“లీలా మహల్ పక్కన పిడత కింద పప్పు, ప్రొద్దుటే బాబాయి హోటల్ ఇడ్లీలు, ఏలూరు రోడ్డు సెంటర్ అజంతా హోటల్ లో ఇడ్లీ, సాంబార్, మోడర్న్ కేఫ్ లో మినప దోసె, దుర్గ కాఫీ హౌసులో మైసూరు బజ్జీ, రవీంద్రా కూల్ డ్రింక్స్ లో ఐస్ క్రీం, పుష్పాల రంగయ్య షాపులో నిమ్మకాయ సోడా, ఏలూరు కాలువ పక్కన బందరు మిఠాయి దుకాణంలో దొరికే నల్ల హల్వా, రామచంద్రరావు హోటల్లో అరటి ఆకు భోజనం. మాచవరం పేరయ్య హోటల్ లో అన్నంతో వడ్డించే గడ్డ పెరుగు, కౌతావారి శివాలయం పక్కన పాణీ కిల్లీ కొట్ట్లులో పచ్చకర్పూరం, జాజిపత్రితో చేసిన తాంబూలం, సీ.వీ.ఆర్. స్కూలు దగ్గర పళని విబూది, వొడికిన జంధ్యాలు అమ్మే షాపు, క్షీరసాగర్ కంటి ఆసుపత్రి, రామమోహన ఆయుర్వేద వైద్య శాల, నందివాడ హనుమత్ సీతాపతి రావు హోమియో వైద్య శాల,సినిమా హాలా లేక శిల్ప కళా క్షేత్రమా అనిపించే దుర్గా కళా మందిరం , మారుతి సినిమా, జైహింద్ టాకీసు, లక్ష్మీ టాకీసు, ఎప్పుడూ హిందీ సినిమాలు ఆడే శేష్ మహల్, ఇంగ్లీష్ సినిమాలు మాత్రమె చూపించే లీలా మహల్, పాత సినిమాలు ఆడే ఈశ్వర మహల్- ఇవీ మాకు తెలిసిన బెజవాడ అంటే.
“రాఘవయ్య పార్క్, రామ్మోహన్ గ్రంథాలయం, వెలిదండ్ల హనుమంతరాయ గ్రంధాలయం, దివ్యజ్ఞాన సమాజం, అన్నదాన సమాజం, కాళేశ్వర రావు మార్కెట్, గాంధీ కొండ, పప్పుల మిల్లు, శరభయ్య గుళ్ళు, అరండల్ సత్రం, చెట్ల బజారు, గోరీల దొడ్డి,కృష్ణలంక పక్కన బిరబిరా పారే కృష్ణమ్మ, ప్రకాశం బరాజు, అందర్నీ చల్లగా చూసే దుర్గమ్మ, దుర్గ గుడిలో గోపికలతో సయ్యాటలాడే కృష్ణుడి బొమ్మలు, అద్దాల మేడ, గుణదల కొండమీద మేరీ మాత, పున్నమ్మతోట, రేడియో స్టేషన్, నక్కలరోడ్డు, అచ్చమాంబ ఆసుపత్రి, అనంతం హాస్పిటల్, ముగ్గురన్నదమ్ముల ఆసుపత్రి, అమెరికన్ ఆసుపత్రి, మాంటిసోరి స్కూలు, బిషప్ అజరయ్య స్కూలు, మాచవరం కొండ, మొగల్రాజపురం గుహలు, ఎస్.ఆర్.ఆర్. కాలేజి, లయోలా కాలేజి, శాతవాహన కాలేజి, గాంధీజీ మునిసిపల్ హైస్కూల్, సి.వి.ఆర్. స్కూలు, ఇవిగో ఇవీ గుర్తుకు రావాలి బెజవాడ పేరు చెప్పగానే.
“మా బెజవాడ చాలా గొప్పది.

 #రజతోత్సవంలోకి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ఆసియాలోనే అతిపెద్ద బస్‌స్టేషన్‌ కోట్లాది మంది రాకపోకలకు నిలయం నేడు విమానాశ్రయ త...
24/09/2015

#రజతోత్సవంలోకి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్
ఆసియాలోనే అతిపెద్ద బస్‌స్టేషన్‌
కోట్లాది మంది రాకపోకలకు నిలయం
నేడు విమానాశ్రయ తరహాలో కార్పొరేట్‌ హంగులు
#ఎన్టీఆర్‌ శంకుస్థాపన చేశారు.. చెన్నారెడ్డి ప్రారంభించారు

ఆసియాలోనే అతి పెద్దదైన పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ రజతోత్సవంలోకి అడుగుపెట్టింది దీని రూపకల్పన చేసింది ఆనాటి ముఖ్యమంత్రి #నందమూరి తారక రామారావు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు చొరవతో కార్పొరేట్‌ స్టయిల్‌లో ఆధునిక సొబగులు అద్దుకుని మళ్ళీ ఆసియాలోనే నెంబర్‌ వన్‌ స్థానాన్ని కైవసం చేసుకోబోతోంది.

#ఆర్టీసీని ప్రగతి చక్రంగా అభివర్ణించిన #ఎన్టీఆర్‌
ప్రతి నియోజకవర్గం పరిధిలో ఒక బస్‌స్టేషన్‌, మండలాల పరిధిలో సెమీ బస్‌స్టేషన్లు, ప్రతి గ్రామంలో బస్టాపుల ఏర్పాటుకు ఆయన ఎంతో చొరవ చూపారు. వీటన్నింటికీ హబ్‌గా మేజర్‌ బస్‌స్టేషన్‌ ఉండాలన్న ఉద్దేశ్యంతో, ఆనాడు రవాణా రంగానికి గుండెకాయగా ఉన్న విజయవాడలో భారీ బస్‌స్టేషన్‌ నిర్మాణానికి ఎన్టీఆర్‌ శ్రీకారం చుట్టారు. 1986లో ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో భాస్కరరావుపేట (ఇప్పుడు ఈ ప్రాంతం లేదు)లో శంకుస్థాపన చేశారు. పీఎన్‌బీఎస్‌ ఏర్పాటుకు భాస్కరరావు పేటను తొలగించాల్సి వచ్చింది. ఇక్కడ పేదలే ఎక్కువగా ఉండేవారు. అప్పటి మేయర్‌ టి. వెంకటేశ్వరరావు ముందుచూపుతో ఆలోచించి ఆనాటి ప్రభుత్వంతో మాట్లాడి బాధితులకు సరైన న్యాయం చే యించి ఒక మహా కార్యక్రమానికి పని సులువు చేశారు.
ఈ బస్‌స్టేషన్‌కు #శాతవాహన బస్‌స్టేషన్‌గా ఆనాడు #ఎన్టీఆర్‌ పేరు పెట్టారు. తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్‌ తలపెట్టిన యజ్ఞాన్ని చెన్నారెడ్డి కొనసాగించారు. కాంగ్రెస్‌ హయాంలోనే బస్‌స్టేషన్‌ పనులు పూర్తయ్యాయి. సెప్టెంబర్‌ 23, 1990లో మర్రి చెన్నారెడ్డి శాతవాహన బస్‌స్టేషన్‌ ప్రారంభించారు. ఆ తర్వాత శాతవాహనగా ఉన్న పేరును నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌గా మార్చారు. 22 ఎకరాల సువిశాల స్థలంలో దీన్ని నిర్మించారు. డిపార్చ్యూర్‌ బ్లాక్‌లో 47, అరైవల్‌ బ్లాక్‌లో 15 ప్లాట్‌ఫారాలున్నాయి. రెండంతస్థుల నిర్మాణమే అయినా భవిష్యత్తులో బహుళ అంతస్థుల భవనంగా మార్చడానికి వీలుగా ఆనాడు పునాది వేశారు.
రెండు దశాబ్దాల కాలంగా బస్‌స్టేషన్‌ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. విభజన అనంతరం పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ నవ్యాంధ్రకు మకుటాయమానమైంది. ఈ స్టేషన్‌ను ఎయిర్‌పోర్టు తరహాలో అభివృద్ధి చేయటానికి ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు శ్రీకారం చుట్టారు. పూర్తిగా ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఇంటీరియర్‌తో పాటు, అద్బుతమైన వాల్‌ ఇంటీరియర్‌, మోడల్‌ ప్రయాణీకుల లాంజ్‌లు, ప్లాస్మా టీవీలు, ఆటోమేటిక్‌ అనౌన్స్‌మెంట్‌, వెబ్‌ బేస్డ్‌ బస్‌పాస్‌ల కౌంటర్‌, కాన్ఫరెన్స్‌ హాల్‌ అభివృద్ధి చేస్తున్నారు.

The tallest statue of Hanuman in the world is located in the village of Paritala on NH-9, approximately 30 km from the c...
23/09/2015

The tallest statue of Hanuman in the world is located in the village of Paritala on NH-9, approximately 30 km from the city of Vijayawada, in the state of Andhra Pradesh, India. The statue, installed in 2003, stands 135 feet tall (41 metres).

Hello Friends...Good Morning....Mana vijayawada lo miku nachina place enti?ee photo ni chusthe em gurthosthundi?
21/09/2015

Hello Friends...
Good Morning....
Mana vijayawada lo miku nachina place enti?
ee photo ni chusthe em gurthosthundi?

జై బోలో గణేష్ మహారాజ్ కి  జై గణపతి పప్ప మోరియా ......విశాఖలో ముందు నుంచి మట్టి మహాగణపతి ఉన్నా అది వేరే తరహా. మట్టితో చేస...
19/09/2015

జై బోలో గణేష్ మహారాజ్ కి జై
గణపతి పప్ప మోరియా ......
విశాఖలో ముందు నుంచి మట్టి మహాగణపతి ఉన్నా అది వేరే తరహా. మట్టితో చేసి… పూజల తర్వాత అక్కడికక్కడే నిమజ్జనం చేస్తారు. ఎత్తు 80 అడుగులకి పైగానే ! అయితే ఊరేగింపు చేసి… నిమజ్జనం చేసే విగ్రహాల్లో చూస్తే విజయవాడ ముందు వరసలోకి వచ్చిందిప్పుడు. రాజధాని రాజసం తెలిసేలే… చుట్టుపక్కల ప్రాంతమంతా తలెత్తేంత రేంజ్ లో కొలువుదీరాడు బొజ్జ గణపయ్య. 63 అడుగుల ఎత్తు. బహుశా ముంబై తర్వాత మనదే భారీ విగ్రహం. ప్రత్యేక ఉత్సవ కమిటీ ఏర్పడి… ప్రతియేటా ఇలాగే భారీ స్థాయిలో నిర్వహిస్తామంటోంది కూడా ....

I NEVER even knew about this!! I wonder if the reports are true... PLEASE SHARE ITDo you know the meaning of the colors ...
22/05/2014

I NEVER even knew about this!! I wonder if the reports are true... PLEASE SHARE IT
Do you know the meaning of the colors on the bottom?
Green : Natural.
Blue : Natural + Medicine.
Red : Natural + Chemical composition.
Black : Pure Chemical.
BE AWARE OF THE PRODUCTS THAT YOU USE DAILY!

wow...!!!
22/05/2014

wow...!!!

22/05/2014

ఆంధ్రప్రదేశ్‌కు భారీ ప్యాకేజీపై మోదీ దృష్టి
ఆంధ్రప్రదేశ్‌కు భారీ ప్యాకేజీపై నరేంద్రమోదీ దృష్టి సారించారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీని త్వరగా రూపొందించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామిని మోదీ బుధవారం ఆదేశించారు. ఈ నెల 26వ తేదీ లోపే సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలన్న పట్టుదలతో మోదీ ఉన్నట్లు తెలియవచ్చింది. దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని భావిస్తున్న మోదీ పలు కీలక అంశాలపై దృష్టి సారించారు. ఉగ్రవాద నిరోధకం, ఇంటిలిజెన్సీ వ్యవస్థలో మార్పులు, దేశం పరువు తీస్తున్న నల్లధనం వంటి అనేక అంశాలపై మోదీ దృష్టి సారించారు. మంగళవారం మోదీతో హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొన్ని ప్రాధాన్యత అంశాలు చర్చకు వచ్చినట్లు తెలియవచ్చింది. దక్షిణాది నుంచి ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడంతో మోదీ సీమాంధ్రపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. .జూన్ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పాటు కానున్న విషయం తెలిసిందే. నరేంద్రమోదీ ఈనెల 26న దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించిన వెంటనే సీమాంధ్రకు భారీ ప్యాకేజీని ప్రకటించాలని ఆయన భావిస్తున్నట్లుగా తెలియవచ్చింది. దీనికి సంబంధించి అనిల్ గోస్వామికి ఒక బ్లూ ప్రింట్ కూడా ఇచ్చినట్లుగా సమాచారం. ప్రస్తుతం దీనిపైనే హోంశాఖ దృస్టి సారించింది.

19/05/2014

Watch Rabhasa first look teaser in HD Quality Starring NTR, Samantha, Pranitha, Brahmanandam etc Directed by: Santosh Srinivas Produced by: Bellamkonda Ganes...

Address

Vijayawada
520010

Website

Alerts

Be the first to know and let us send you an email when Vijayawada Official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vijayawada Official:

Share