Telangana Lorry Owners Association

Telangana Lorry Owners Association Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Telangana Lorry Owners Association, Cargo and freight company, Hyderabad.

ఈ రోజు నా చెల్లెలు స్వర్గీయ కంబాలపల్లి విజయలక్ష్మి చిన్న కొడుకు (వకీలు సాబ్ )శ్రవణ్ ప్రసాద్ రెడ్డి  గురువుగారైన T, Venka...
03/12/2025

ఈ రోజు నా చెల్లెలు స్వర్గీయ కంబాలపల్లి విజయలక్ష్మి చిన్న కొడుకు (వకీలు సాబ్ )శ్రవణ్ ప్రసాద్ రెడ్డి గురువుగారైన T, Venkat Raju goud Advocate (గవర్నమెంట్ ప్లిడర్ )గారితో కలిసి మా మేనల్లుడు హైకోర్టు లో అడ్వకెట్ ప్రాక్టీస్ మొదలెట్టిన తరువాత చారిత్రక కట్టడం లో తెలంగాణా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం లో వెంకట్ సార్ ను కలిసి వారి సహకారానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది 🌹🌹🙏🙏

ఈ రోజు గౌరవ తెలంగాణా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రశర్ టిప్పర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులతో కలిసి తెలంగాణా రాష...
26/11/2025

ఈ రోజు గౌరవ తెలంగాణా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రశర్ టిప్పర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులతో కలిసి తెలంగాణా రాష్ట్ర మైనింగ్ శాఖ డైరెక్టర్ మరియు తెలంగాణా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ &మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ భవేశ్ మిశ్రా గారిని కలిసి తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా క్రషర్ కంకర రవాణా చేస్తున్న సమయాలలో సామాన్య యజమానులకు డ్రైవర్లకు ఎదురైతున్న సమస్యలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక రవాణా చేస్తున్న సమయాలలలో అధికారిక క్వారీలలో లోడింగ్ డబ్బుల వసూళ్లపైన మరియు ఇతర అనేక సమస్యలపైన సుధీర్ఘ చర్చ చేయడం జరిగింది విటన్నింటికి త్వరలో ముగింపు పలుకుతానని గౌరవ ఎం డి గారు తెలియచేయడం జరిగింది వారు స్పందించిన విధానానికి తెలంగాణా లారీ ఓనర్స్ అసోసియేషన్ తరపున ధన్యవాదములు తెలియచేస్తున్నాము 🙏🙏

08/11/2025

టిప్పర్ అసోసియేషన్ సభ్యులకు ఎదురైతున్న సమస్యలపై పెద్ద అంబర్పేట్ లో జరిగిన సమావేశం లో

ఈ మధ్య కాలంలో వినాయక,గణపతి ఉత్సవాలు చేసే భక్తుల సంఖ్య పెరగడం సంతోషం కానీ నిమజ్జనం సందర్బంగా వాహనాల అవుసరం ప్రతి సంవత్సరం...
02/09/2025

ఈ మధ్య కాలంలో వినాయక,గణపతి ఉత్సవాలు చేసే భక్తుల సంఖ్య పెరగడం సంతోషం కానీ నిమజ్జనం సందర్బంగా వాహనాల అవుసరం ప్రతి సంవత్సరం పెరిగిపోతుంది కాబట్టి యంత్రాంగం నిర్వాకులు ముందస్తు ప్లాన్ చేసుకుని వాహనాలు సమకూర్చుకోవాలి కానీ రోడ్లపైన నిలబడి ఇతర అవుసరాలకొరకు రోడ్డు పైన వెళుతున్న తెలంగాణా రాష్ట్ర వాహనాల తో పాటు ఇతర రాష్ట్ర వాహనాలను కూడా కొన్ని ప్రాంతాలలో దౌర్జన్యం చేసి ఓనరు కు కనీసం సమాచారం ఇవ్వకుండా లారీని నిర్వాహాకుల కస్టడిలోకి తీసుకుని లారీ కాగితాలు తాళం చెవులు డ్రైవర్ సెల్ ఫోన్ లాక్కుని ఇష్టం లేని డ్రైవర్లను ఇబ్బందులకు గురిచేయడం జరుగుతుంది లారీలు వ్యాపారపరంగా ముందే ట్రాన్స్పోర్ట్ చేయడానికి వ్యాపారస్తులతో ఒప్పందం చేసుకుని వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకుని వెళుతున్న లారీలను ఆపి ఇబ్బందులకు గురిచేయకూడదని అలా చేయడం వలన మాకు ఆర్థికంగా నష్టం జరుగుతుంది ప్రస్తుతం రవాణా రంగం చాలా ఒడిదుడుకులు ఎదురుకుంటుంది ఒప్పుకున్న ఆర్డర్లు,పార్టీలు వెళ్ళిపోతాయి తద్వారా మా ఉపాధి దెబ్బతిని ఇబ్బందులకు గురికావడం జరుగుతుంది కాబట్టి నిర్వాహకులు ఎవరైనా ముందే లారీ ఓనర్స్ డ్రైవర్ల మాట్లాడుకుని వారి ఇష్టం తో వాహనాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము అధికారులు కానీ నిర్వాహకులు కానీ బలవంతంగా వాహనాలు తీసుకోవద్దని తెలంగాణా పోలీస్ DJP, తెలంగాణా రవాణా శాఖ TC గార్లకు మరియు విజ్ఞప్తి చేయడం జరిగింది 🙏🙏

మిత్రులందరికీ నమస్కారం 🙏తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గూడ్స్ వాహనాలతో పాటు ఇతర రాష్ట్రాల సరుకు రవాణా చేసే లారీల డ్రైవ...
31/05/2025

మిత్రులందరికీ నమస్కారం 🙏తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గూడ్స్ వాహనాలతో పాటు ఇతర రాష్ట్రాల సరుకు రవాణా చేసే లారీల డ్రైవర్లు, యజమానులు ప్రతి ఖరీప్, రబీ సీజన్ ల లో తెలంగాణా రాష్ట్ర రైతులు పండిస్తున్న ధాన్యాన్ని కొంటున్నాము అని చెపుతూ ప్రతి ఏడు ఏ రాష్ట్రం లో లేని విదంగా లారీ డ్రైవర్ల మీద దుర్మార్గం దౌర్జన్యం చేస్తున్న అధికారులు రైతుల పేరు చెప్పి మేమేదో రైతులకు లారీ యజమానులు వ్యతిరేకం అన్నట్టు సృష్టించి లారీ యజమానుల పై వ్యతిరేకత తేవడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు మేము రైతుల ధాన్యం రవాణా చేయడానికి ఎక్కడ వ్యతిరేకం కాదు పద్ధతి ప్రకారం కాంట్రాక్టర్లు నిబంధనల ప్రకారం రవాణా చేయాలి కానీ ఇతర రాష్ట్రాల నుండి అనేక అవుసరాలకొరకు వచ్చి పోయే లారీలను తెలంగాణా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ఇసుక కొరకు డబ్బులు చెల్లించి వినియోగదారునికి సమయానికి ఇసుక డెలివరరీ చేస్తామని చెప్పితే వాళ్ళు స్లాబ్ వెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు సమయానికి ఇసుక సప్లై చెయ్యకపోతే వాళ్ళు మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వరు అదేవిదంగా ఇతర అవుసరాలకు వెళుతున్న లారీల పనులు డిస్టర్బ్ అయ్యి నష్టపోతారు రోడ్ల మీద లారీలను ఆపి ధాన్యం రవాణా చేయాలని బలవంతంగా లారీలు గుంజుకుని వారి కస్టడీలో పెట్టుకుని ధాన్యం నింపి రైస్ మిల్లులకు పంపిన సందర్బంగా వారు రోజుల తరబడి కాళీ చేయకుండా వారి వద్దనే పెట్టుకుని మూడు నాలుగు రోజుల తరువాత ఇంకొక మిల్లుకు పంపడం జరుగుతుంది అక్కడ కూడా కాళీ కాక ఎదురు చూడాల్సిన పరిస్థితి రోడ్డు మీద పట్టుకుని పంపే లారీలకు కిరాయి ఎవరిస్తారు ఎక్కడ తీసుకోవాలి లక్షల రూపాయలు ప్రయివేట్ బ్యాంక్ లలో రుణాలు తీసుకుని లారీలు కొంటాము మాకు ఎవరి సపోర్ట్ ఉండదు మమ్మల్ని ఎవరు పట్టించుకోకుండా ఇంకా మా ఉపాధి కి గండి కొట్టే ప్రయత్నాలు చేస్తూ అసలు ధాన్యం రవాణా చేయడానికి కాంట్రాక్టు తీసుకున్న కాంట్రాక్టర్లు, రైస్ మిలర్స్ ను మండల జిల్లా రాష్ట్ర అధికారులు సమన్వయం చేసి ఎన్ని లారీలు ఎక్కడ ఏ సెంటర్ కు అవుసరం అనేవిషయం చర్చించి రైస్ మిల్లు యజమానుల తో మాట్లాడి సమస్య పరిష్కారం చెయ్యకుండా పుండు ఒక దగ్గర ఉంటే మందు ఇంకొక దగ్గర రుద్దినట్టు వెంట వెంటనే కాళీ చేస్తే ఒక్కో రైస్ మిల్లులో 20,30లారీలు వరుసగా రోజుల తరబడి ఎందుకు వేచి ఉంటాయి ఏ రోజు కు ఆరోజు కాళీ చేస్తే అసలు లారీల కొదువ నే ఉండదు కాంట్రాక్టర్ పెట్టిన లారీలు రోజు కాళీ చేయకపోవడం వలన అధికారులకు ఇబ్బందులు వస్తున్నాయు రోడ్ల మీద పడి ఇతర రాష్ట్ర లారీలను ఆపి ఈ రాష్ట్ర పరువును మంట కలపాల్సిన పరిస్థితి రాదు కాబట్టి రైస్ మిల్లుల యజమానుల సమస్యలు తెలుసుకుని కాళీ చేయకపోవడానికి మిలర్స్ యజమానులను కారణాలు అడిగి తెలుసుకోవాలి కాంట్రాక్టర్లతో మాట్లాడి లారీలు రైతులకు పంపాలి కానీ ఇలా దౌర్జన్యం చేస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా లారీ యజమానులు డ్రైవర్లు ఎదురు తిరుగాల్సిన పరిస్థితి వస్తది ప్రభుత్వం అసలు ధాన్యం రవాణా నిలిపి వేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అధికారులు గ్రహించాలని ఇతర విషయాలు అన్ని గౌరవ పౌర సరఫరాల శాఖ కమిషనర్ శ్రీ డి ఎస్ చౌహన్ గారిని కలిసి రాష్ట్ర లారీ యాజనుల తో పాటు ఇతర రాష్ట్ర లారీ యజమానులు ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది ఇతర రాష్ట్ర లారీ డ్రైవర్లు యజమానుల ముందు మన రాష్ట్ర పరువు పోతుందని అదే కాకుండా మేము రైతుల ధాన్యం రవాణా చేయడాన్ని వ్యతిరేకిస్తలేము మేము కూడా సంతోషిస్తున్నాము రైతుకు సహాయం చేస్తున్నామని మమ్మల్ని సంపుతాము అంటే ఎలా ⁉️రైతులకు సహాయం చెయ్యాలి వారితో పాటు మమ్మల్ని కాపాడని కమిషనర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది కమిషనర్ గారు వెంటనే స్పందించి డైరెక్టర్ గారికి చెప్పడం జరిగింది మేము కూడా డైరెక్టర్ గారిని కలిసి పూర్తి విషయం వివరించాము వారు ఈ సమస్య ను శాశ్వతంగా పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు 🙏ఇట్లు, మంచి రెడ్డి రాజేందర్ రెడ్డి తెలంగాణా లారీ ఓనర్స్ అసోసియేషన్ TLOAరాష్ట్ర అధ్యక్షులు 🙏

24/05/2025
భవేశ్ మిశ్రా IAS గారు నూతనంగా TGMDC వైస్ చైర్మన్ &ఎం, డి గా భాద్యతలు తీసుకున్న సందర్బంగా వారిని తెలంగాణా లారీ ఓనర్స్ అసో...
24/05/2025

భవేశ్ మిశ్రా IAS గారు నూతనంగా TGMDC వైస్ చైర్మన్ &ఎం, డి గా భాద్యతలు తీసుకున్న సందర్బంగా వారిని తెలంగాణా లారీ ఓనర్స్ అసోసియేషన్ TLOA తరపున కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది అదేవిదంగా గత కొన్ని నెలలుగా ప్రభుత్వానికి ఇసుక లోడింగ్ కొరకు ఆన్ లైన్ లో కడుతున్న డబ్బులకు సరిపడా ఇసుక 12,14,16టైర్ లారీలకు రెండు టన్నులకు పైగా తక్కువ నింపుతున్నారు సాండ్ బజార్ వెహికిల్స్ కు ఎక్కువ నింపుతున్నారు కావున అన్ని లారీలకు కేంద్ర మోటారు వాహన చట్టం ప్రకారం కార్పొరేషన్ కు డబ్బులు కడుతున్నాము కావున మాకు రావలిసిన ఇసుక నింపాలి అని తెలియచేయడంతోపాటు చిన్న బోయిన పల్లి చెక్ పోస్ట్ వద్ద ఎదురైతున్న ఇబ్బందులతో పాటు అనేక సమస్యలు వైస్ చైర్మన్ గారితో చర్చించడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి మీకు ఎదురైతున్న సమస్యలను వారంరోజులలో అన్ని సమస్యలు పరిష్కారం చేస్తానని తెలియచేయడం జరిగింది 🌹🌹

ఈరోజు తెలంగాణ ఆల్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నాగన్న గౌడ్ నాయకత్వం లో TPCC అధ్యక్షులు బొమ్మ మహేష...
19/04/2025

ఈరోజు తెలంగాణ ఆల్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నాగన్న గౌడ్ నాయకత్వం లో TPCC అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసి రవాణా రంగం లో ఎదురైతున్న సమస్యల పరిష్కారం కొరకు వినతి పత్రాన్ని ఇవ్వడం అయినది పిసిసి అధ్యక్షులు మాట్లాడుతూ ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి వారితో ఒక సమావేశం ఏర్పాటు చేసి సంక్షేమ బోర్డు వచ్చేవిధంగా అదేవిదంగారెండు తెలుగు రాష్ట్రాల మధ్యలో కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ గురించి పిట్నెస్ రెన్యూవల్ పీజు విషయం సరిచేసే ప్రయత్నం చేస్తాం అని వారు మాకు హామీ ఇవ్వడం అయినది ఈ కార్యక్రమంలో తెలంగాణా లారీ ఓనర్స్ అసోసియేషన్ TLOAఅధ్యక్షులు తెలంగాణా లారీ ఓనర్స్ &వర్కర్స్ యూనియన్INTUC రాష్ట్ర అధ్యక్షులు మంచిరెడ్డి రాజేందర్ రెడ్డి మరియు గణేష్, సుధీర్ రెడ్డి గారు అదేవిదంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణా ఐ ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి Yనాగన్న గౌడ్ గారు,ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, నరసింహారెడ్డి గారు ప్రధాన కార్యదర్శి జి మల్లేష్ గౌడ్ గారు,తెలంగాణ స్టేట్ క్యాబ్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు B రామకృష్ణారెడ్డి GHMC ఆటో యూనియన్ ప్రెసిడెంట్ s దయానంద్ క్యాబ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కందుల ఉపేందర్ వైస్ ప్రెసిడెంట్ నాగేష్ ఎండి షాబీర్ జిహెచ్ఎంసి క్యాబ్ యూనియన్ ప్రెసిడెంట్ మహేందర్ జిహెచ్ఎంసి ప్రధాన కార్యదర్శి శ్రవణ్ మైనార్టీ క్యాబిన్ యూనియన్ ప్రెసిడెంట్ జుబేర్ బలే రామ్ శివ రాజారెడ్డి విజయ్ రెడ్డి శ్రీనివాస్ దానయ్య వికారాబాద్ క్యాబ్ యూనియన్ ప్రెసిడెంట్ మల్కప్ప మహబూబ్నగర్ క్యాబ్ యూనియన్ ప్రెసిడెంట్ రాఘవేందర్ రాష్ట్రస్థాయి నాయకులు అందరూ పాల్గొనడం అయినది 🙏

25.03.2025రోజున ఆంధ్రప్రదేశ్ విజయవాడ రాష్ట్ర ప్రధాన రవాణా శాఖ కార్యాలయంలో జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ...
27/03/2025

25.03.2025రోజున ఆంధ్రప్రదేశ్ విజయవాడ రాష్ట్ర ప్రధాన రవాణా శాఖ కార్యాలయంలో జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీ మనీష్ కుమార్ సిన్హా గారిని కలిసి సింగల్ పర్మిట్ ఆలస్యం కావడానికి కారణాలపై చర్చించి ఆ సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ గౌరవ మంత్రివర్యులు మండపల్లి రాంప్రసాద్రెడ్డి(రాముడు )గారికి వివరించడం జరిగింది దానితో గౌరవ మంత్రివర్యులు అధికారుల సమన్వయ లోపంతో ఈ సమస్య ఆలస్యం జరుగుతోంది కాబట్టి వెంటనే రెండు రాష్ట్రాల మంత్రులతో అలాగే ఉన్నత అధికారులతో ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి మరియు కమిషనర్ల తో ఒక మీటింగ్ అరేంజ్ చేసి రాష్ట్రం విడిపోయినప్పటి పది సంవత్సరాలనుండి పెండింగ్లో ఉన్న ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం తప్పకుండా చేస్తానని తెలియజేయడం జరిగింది 🙏🙏 ఈ కార్యక్రమంలో తెలంగాణ లారీ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు శ్రీ నూకల భాస్కర్ రెడ్డి మిర్యాలగూడ గారు, తెలంగాణ లారీ ఓవర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మంచిరెడ్డి రాజేందర్ రెడ్డి (నేను )తెలంగాణా లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి షేక్ భాషా మిర్యాలగూడ గారు వారి బృందం, తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ కోశాధికారి శ్రీ వేముల భూపాల్ వరంగల్ గారు వరంగల్ జిల్లా కోశాధికారి జాకీర్ గారు, ఈశ్వర్ గారు, న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు మహరధి గారు, శేషగిరి గారు వారి బృందం పాల్గొనడం జరిగింది🌹🌹🙏🙏

Address

Hyderabad
500004

Telephone

+919440648859

Website

Alerts

Be the first to know and let us send you an email when Telangana Lorry Owners Association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Telangana Lorry Owners Association:

Share